![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -341 లో.. మురారికి గతం గుర్తుకు రావడం తట్టుకోలేని ముకుంద సూసైడ్ ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ , గౌతమ్ ఇద్దరు ముకుందకి ట్రీట్ మెంట్ చేస్తారు. ఆ తర్వాత కృష్ణ తప్పు చెయ్యలేదని మురారి నిరూపిస్తానని భవానికి ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత కృష్ణ అవుట్ హౌస్ లో ఉన్న కూడా ఈ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు పోవచ్చని మురారి చెప్తాడు.
మరొకవైపు కృష్ణ వెళ్తుంటే రేవతి పిలుస్తుంది. మురారికి ఎలా గతం గుర్తుకు వచ్చిందో కృష్ణ చెప్తుంది. నా దగ్గరికి వచ్చి నీ భర్త ఎవరని అడిగేవారు. దాంతో మీకు గతం గుర్తుకు వస్తే నా భర్త ఎవరో తెలుస్తుందని అనగానే.. తన గతం గుర్తుకు తెచ్చుకోనే ప్రయత్నం చేశారు. ఇక నేను కోనేటిలో పడగానే.. ఏసీపీ సర్ కి గతం గుర్తుకు వచ్చిందని రేవతికి కృష్ణ చెప్తుంది. మరొకవైపు శకుంతల కృష్ణ జీవితం బాగవుతున్నందుకు దేవుడికి మొక్కుకుంటుంది. ఆ తర్వాత అక్కడికి మురారి వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తాడు. తప్పు చేసిన వాళ్లని పట్టుకుంటానని వాళ్ళకి చెప్పగానే.. కృష్ణ శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత కృష్ణపై మురారి కోపంగా ఉంటాడు. అసలు ఇన్ని రోజులు నువ్వే నా భార్య అని ఎందుకు చెప్పలేదని మురారి అడుగుతాడు. పెద్ద అత్తయ్య గారంటే ఇంట్లో ఎంత గౌరవం తెలుసు కదా అందుకే చెప్పలేదని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ జరిగింది మొత్తం మురారికి చెప్తుంది. అందులో తన తప్పేం లేదంటు మురారికి క్లారిటి ఇస్తుంది కృష్ణ. ఆ తర్వాత కృష్ణ చెంపపై మురారి ముద్దు పెడతాడు.
మరొకవైపు భవాని తను తీసుకున్న నిర్ణయంపై ఆలోచనలో పడుతుంది. తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని తన అంతరాత్మ చెప్తుంది. మరొకవైపు ముకుంద నిద్రలో నుండి లేచి కృష్ణని చూసి కోపంగా ఎందుకు బతికించావని అనగానే.. నువ్వు ముందు టాబ్లెట్స్ వేసుకోనని కృష్ణ అంటుంది. తరువాయి భాగంలో.. ఇక నేను డ్యూటీలో జాయిన్ అవుతానని భవాని దగ్గర మురారి ఆశీర్వాదం తీసుకొని.. కృష్ణ వాళ్ళ చిన్నాన్న ఏ తప్పు చెయ్యలేదని నిరూపించాలి. అందుకే వాళ్ళ చిన్నన్నని ఆ తర్వాత హాస్పిటల్ లో డాక్టర్ ని కలవాలని అనగానే.. ఎక్కడ తన అన్నయ్య గురించి బయట పడుతుందోనని ముకుంద టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |